ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం…ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. ఎన్నికల వ్యయ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. లోక్సభ ఎన్నికల్లో పెద్ద రాష్ట్రాల్లో అభ్యర్థుల వ్యయపరిమితిని గరిష్ఠంగా రూ.95 లక్షలకు పెంచగా, చిన్న రాష్ట్రాల్లో దీనిని రూ.54 లక్షల చేసింది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద రాష్ట్రాల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిమితి ప్రస్తుతం రూ.28 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచగా, చిన్న రాష్ట్రాల్లో వ్యయ పరిమితిని గరిష్టంగా రూ.28 లక్షలు చేసింది. ఇక నుంచి జరగబోయే అన్ని ఎన్నికలకు ఈ కొత్త వ్యయపరిమితి వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది.













