ముగిసిన ఏడో దశ ప్రచారం పర్వం

సార్వత్రిక ఎన్నికల ఘట్టం తుది అంకానికి చేరింది. ఏడో, చివరి దశ లోక్‌సభ ఎన్నికల ప్రచార ఘట్టానికి తెరపడిరది. దీంతో రెండు నెలలుగా కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియ జూన్ ఒకటో తేదీన జరిగే ఏడో దశ పోలింగ్‌తో పూర్తి కానుంది. ఏడు రాష్ట్రాలలోని 57 లోక్‌సభ సీట్లకు ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 904 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఏడో దశలో యూపీలో 13 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీహార్‌లోని 8, పశ్చిమ బెంగాల్‌లో 9, జార్ఖండ్‌లో 3, పంజాబ్ 13, హిమాచల్ ప్రదేశ్ 4, ఒడిశా 6 లోక్‌సభ స్థానాలతో పాటు 42 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. అటు కేంద్ర పాలిత ప్రాంతం చండీఘర్‌కు ఈ విడతలోనే ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. చివరి విడతలో పలు కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. వారణాసి నుంచి ప్రధాని మోదీ, మండి నుంచీ బీజేపీ అభ్యర్థిగా కంగనా రనౌత్, హామిపూర్ నుంచి కేంద్ర మంత్రిగా అనురాగ్ ఠాకూర్, గోరక్‌పూర్ నుంచి నటుడు రవి కిషన్, డైమండ్ హార్బర్ నుంచి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీలో ఉన్నారు.