వందేండ్ల తర్వాత కనిపించిన అత్యంత అరుదైన మొక్క
అత్యంత అరుదైన లిప్‌స్టిక్ మొక్కను బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (బీఎస్ఐ) పరిశోధకులు అరుణాచల్‌ప్రదేశ్‌లో గుర్తించారు. అంజా జిల్లాలో కిందటేడాది డిసెంబర్లో ఇది కనిపించింది. లిప్‌స్టిక్ మొక్క శాస్త్రీయ నామం ఏస్కీనాంథస్ మానటే రియా డ్యూన్. దీని పువ్వులు లిప్‌స్టిక్‌లాగా గులాబీ రంగులో ఉంటాయి. దీన్ని మొట్ట మొదటిసారిగా 1912లో బ్రిటిష్ శాస్త్రవేత్త స్టీఫెన్ డ్యూన్ అరుణాచల్ ప్రదేశ్‌లోనే దీన్ని కనుగొన్నారు. ఈ మొక్క మళ్లీ వందేండ్ల తర్వాత కనిపించడం విశేషం. లిప్‌స్టిక్ మొక్క ఐయూసీఎన్ అంతరించి పోతున్న మొక్కజాతుల్లో ఉన్నది.













