గోవా సీఎం అభ్యర్థిని ప్రకటించిన ఆప్
2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న అయిదు రాష్ట్రాల ఎన్నికలు దేశంలో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఈ క్రమంలో గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో పట్టు సాధించాని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గోవా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. గోవా ఆప్ సీఎ అభ్యర్థిగా లాయర్ అమిత్ పాలేకర్ పేరును ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పనాజిలో జరిగిన మీడియా సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. అమిత్ పాలేకర్ది ఓబీసీ బండారీ సామాజిక వర్గం. గోవాలో దాదాపు 35 శాతం జనాభా వీరే ఉన్నారు. ఇటీవల పాత గోవాలోని చారిత్రక ప్రాంతంలో అక్రమ కట్టడాలను నిరసిస్తూ నిరాహార దీక్ష చేపట్టి పాలేకర్ వార్తల్లో నిలిచారు. గతేడాది అక్టోబర్‌లో ఆప్‌లో చేరారు. సీఎం అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పాలేకర్, కేజ్రీవాల్ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. గోవాలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. 40 స్థానాలకు ఫిబ్రవరి 14న పోలింగ్ నిర్వహించనున్నారు.













