ములాయం తో భేటీ అయిన లాలూ ప్రసాద్ యాదవ్
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్‌వాద్ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌తో భేటీ అయ్యారు. ములాయంను కలుసుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి వాకబు చేశానంటూ లాలూ ప్రసాద్ యాదవ్ తమ భేటీకి సంబంధించిన పలు ఫోటోలను ట్విటర్లో పోస్ట్ చేశారు. రైతులు, పేదలు, నిరుద్యోగులు, అసమానత్వం వంటి పలు అంశాలపై తాము పరస్పరం తమ ఆలోచనలు పంచుకున్నామని చెప్పారు. దేశానికి ఇప్పుడు మతతత్వం, క్యాపిటలిజం అవసరం లేదని సంక్షేమం, సమానత్వం అవసమరని భేటీ అనంతరం లాలూ వ్యాఖ్యానించారు. లాలూ, ములాయం భేటీలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా పాల్గొన్నారు.
చిన్న పార్టీలతో పొత్తులతో ముందుకెళతామని అఖిలేష్ పేర్కొన్న నేపథ్యంలో తాజా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే ప్రతిపాదనతో గతనెలలో అఖిలేష్ యాదవ్ ఆఫ్ నేత సంజయ్ సింగ్‌తోనూ చర్చలు జరిపారు. కాగా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒం•రి పోరుకు సిద్ధంగా ఉన్నామని ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని బీఎస్పీ ఇప్పటికే సృష్టం చేసిన సంగతి తెలిసిందే.













