దాణా స్కామ్ కేసులో ..లాలూ ప్రసాద్ యాదవ్‌కు శిక్ష ఖరారు
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు జైలు శిక్ష ఖరారైంది. దొరండా దాణా స్కామ్ కేసులో లాలూ యాదవ్‌ను దోషిగా నిర్ధారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు ఐదేళ్ల జైలు శిఖను ఖరారు చేసింది. సంచలనాత్మక దాణ కుంభకోణానికి సంబంధించిన ఐదో కేసులోనూ ఆయన దోషిగా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దొరండా దాణా స్కామ్ కేసులో లాలూ యాదవ్ ను దోషిగా నిర్ధారిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు గత వారం తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో జైలు శిక్షతోపాటు 60 లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది సీబీఐ కోర్టు.
బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మొత్తం రూ. 950 కోట్ల దాణా స్కామ్‌కు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు రాగా దొరండా ట్రెజరీలో కేసులో 139.35 కోట్ల మేర స్కామ్ జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. మొత్తం 99 మందిలో 24 మందిని నిర్ధోషులుగా చేయగా, 46 మందికి గతవారం సీబీఐ ప్రత్యేక కోర్టు మూడేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది.













