దినేశ్వర్ శర్మ మృతిపై మోదీ, అమిత్ షా సంతాపం
ఇంటెలిజన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్, కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ పాలనాధికారి దినేశ్వర్ శర్మ(66) శ్వాసకోశ సంబంధిత సమస్యలతో శుక్రవారం కన్నుమూశారు. 2019 అక్టోబర్లో లక్షద్వీప్ పాలనాధికారిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. శర్మ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శర్మ భారత దేశ పోలీసింగ్, భద్రతా వ్యవస్థల్లో సుదీర్ఘకాలం సేవలందించారని, తన కెరీర్లో ఆయన ఎన్నో సున్నితమైన ఉగ్రవాద, తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్లను అత్యంత చాకచక్యంగా నిర్వహించారని ప్రధాని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. శర్మ ఐపిఎస్లో అంకిత భావం కలిగిన అధికారిగా దేశానికి సేవ చేశారని, ఆయన మృతి వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని అమిత్ షా అంటూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.













