కుటుంబశ్రీ ట్రైనర్ కు అరుదైన ఘనత
కేరళలో కుటుంబశ్రీ పథకంలో ట్రైనర్‌గా పనిచేస్తున్న సామాజిక కార్యకర్త సఫనా షమ్నా అరుదైన ఘనత సాధించారు. జెనీవాకు చెందిన యునైటెడ్ పీపుల్ గ్లోబల్ (యుపిజి) అందించే ఈ ఏడాది లీడర్షిప్ ప్రోగ్రామ్‌కు ఆమె ఎంపికయ్యారు. మలప్పురం జిల్లాలోని మంకాడకు చెందిన షమ్నా 159 దేశాల నుంచి ఎంపికైన 500 మంది యువ నాయకుల్లో ఒకరు. 130 మంది తో కూడిన ప్యానెలిస్ట్ బృందం ఆమెను ఎంపిక చేసినట్టు యుపిజి తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు ప్రతీ సంవత్సరం యుపిజి శిక్షణను అందిస్తుంది. 9 వారాల పాటు సాగే ఈ తరగతులు మార్చి 14 నుంచి ప్రారంభం కానున్నాయి.













