కూచిపూడి కళాకారిణి స్వర్ణలతకు వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరానికి చెందిన కూచిపూడి కళాకారిణి బి.స్వర్ణలతకు అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ లభించింది. ఈ నెల 24న బెంగళూరులో జరిగిన అంతర్జాతీయ పీస్ కాన్ఫరెన్స్లో యూనివర్సిటీ పలు రంగాలకు చెందిన వారికి డాక్టరేట్లు ప్రదానం చేసింది. అందులో భాగంగా కూచిపూడి కళాకారిణి స్వర్ణలతకు డాక్టరేట్ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా నీతి అయోగ్ ఐఈఎస్ సలహాదారు శివప్ప, సెక్రటరీ జనరల్ డాక్టర్ శ్రీనివాస్ ఏలూరి, ఆ యూనివర్సిటీ డైరెక్టర్ నీలమణి తదితరుల నుంచి డాక్టరేట్ అందుకున్నారు.













