తమిళనాడు గవర్నర్‌గా కృష్ణంరాజు?
బీజేపీ సీనియర్ నేత, సినీ నటుడు రెబల్‌స్టార్ కృష్ణంరాజును తమిళనాడు గవర్నర్‌గా నియమిస్తున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారమైంది. దీంతో చాలామంది కృష్ణంరాజుకు అభినందనలు తెలుపుతున్నారు. అయితే ఈ విషయంలో అధికారికంగా ప్రకటన విడుదల కాలేదు. కేంద్రం ఉత్తర్వులు జారీ చేయకముందే ఈ నియామక ప్రచారం మాత్రం స్పీడ్‌గా సాగుతోంది. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణకు చెందిన విద్యాసాగర్ రావును మహారాష్ట్ర గవర్నర్‌గా ఎంపిక చేశారు. ఆయన కొద్ది కాలంపాటు తమిళనాడు ఇంఛార్జి గవర్నర్‌గానూ వ్యవహరించారు. బండారు దత్తాత్రేయ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు.













