ప్రవాసీ భారతీయ దివస్ కు తెలంగాణ నుంచి.. తొలి ప్రతినిధిగా కోటపాటి
మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో ఈ నెల 8 నుంచి 10 వరకు నిర్వహించనున్న 17వ ప్రవాసీ భారతీయ దివస్‌కు తెలంగాణ రాష్ట్రం నుంచి తొలి ప్రతినిధిగా ప్రవాస భారతీయ హక్కుల పరిరక్షణ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహంనాయుడు హాజరు కానున్నారు. గాందీజీ దక్షిణాప్రికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన జనవరి 9వ తేదీన విదేశీ వ్యవహారాలశాఖ ప్రతి రెండేండ్లకోసారి ప్రవాసీ భారతీయ దివస్‌గా నిర్వహిస్తున్నది. ఇప్పటి వరకు 16 సార్లు ఈ వేడుకలు జరిగాయి. ఈ ఏడాది ఇండోర్‌లో జరిగే వేడుకలకు ఎన్నారైలు, వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రానున్నారు. విదేశాల్లో భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి ప్రభుత్వ స్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నట్టు కోటపాటి నరసింహం నాయుడు తెలిపారు.













