కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన.. న్యాయవ్యవస్థలో
న్యాయవ్యవవస్థలో రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం, నిబంధనల ప్రకారం న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు కల్పించడం లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ, జడ్జీలుగా నియమించే సమయంలో ప్రాతినిదిధ్యం లేని వర్గాలను దృష్టిలో ఉంచుకొని సిఫార్సు చేయాలని జడ్జీలు, కొలీజియంకు సూచించినట్లు తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంటులో వెల్లడించారు. న్యాయమూర్తుల నియామకంలో రిజర్వేషన్లు కల్పించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందా? అని డీఎంకే నేత తిరుచ్చి శివ రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగారు. దీనికి బదులిచ్చిన కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రస్తుతం అనురిస్తోన్న విధానం, నిబంధనల ప్రకారం న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు లేవు. అయినప్పటికీ, న్యాయమూర్తులుగా పేర్లను సిఫార్సు చేసేటప్పుడు వెనకబడిన తరగతులు, మహిళలతో పాటు న్యాయవ్యవస్థలో ప్రాతినిధ్యం లేని వర్గాల పేర్లను పొందుపరచాలని జడ్జీలకు, ముఖ్యంగా కొలీజియం సభ్యులకు గుర్తు చేశాను అని వెల్లడిరచారు.













