కేరళలో మే 8 నుంచి లాక్‍డౌన్

కేరళలో కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు పూర్తిస్థాయి లాక్‍డౌన్ విధించబోతున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. తిరువనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లాక్‍డౌన్ ఈ నెల 8న ప్రారంభమై 16 వరకు కొనసాగుతుందని తెలిపారు. కేరళ రాష్ట్రంలో మే 8 ఉదయం 6 గంటల నుంచి లాక్‍డౌన్ అమల్లోకి వస్తుందని తెలిపారు. కొవిడ్ 19 సెకండ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తప్పలేదు అని అన్నారు. రాష్ట్రంలో వారం రోజులపాటు సంపూర్ణ లాక్‍డౌన్ విధిస్తున్నామని తెలిపారు. దేశంలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. రోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు, కంప్లీట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్‍డౌన్‍లు, సంపూర్ణ లాక్‍డౌన్‍ల వంటి ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా కేరళ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో సంపూర్ణ లాక్‍డౌన్ విధించింది.