శబరిమల యాత్ర…మార్గదర్శకాల విడుదల
ఈ ఏడాది నవంబర్ 16 నుంచి శబరిమల యాత్ర ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. రోజుకు 25 వేల మంది భక్తులు అయ్యప్పను దర్శనం చేసుకునేందుకు వీటుగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రెండు టీకాలు వేయించుకున్నవారు లేదంటే ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో నెగెటివ్ వచ్చిన భక్తులకు మాత్రమే ఆలయంలోకి అనుమతించాలని నిర్ణయించింది. దర్శనం అనంతరం సన్నిధానంలో ఎవరూ ఉండకుండా తిరిగి వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక గత ఏడాది తరహాలోనే యాత్రికులను ఎరుమేలి మీదుగా అటవీ మార్గంలో పులిమేడు మీదుగా సన్నిధానానికి అనుమతించకూడదని సర్కార్ నిర?యం తీసుకుంది. నీలక్కల్ నుంచి భక్తులు కేరళ ప్రభుత్వ ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఉన్న భక్తులు కోవిడ్ పరీక్షల తరువాతే శబరిమల యాత్రకు రావాలని ఆదేశించారు.













