శబరిమల యాత్రకు గ్రీన్ సిగ్నల్
ఈ ఏడాది శబరిమల యాత్రకు అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, కరోనా నిబంధనలకు లోబడి యాత్ర కొనసాగుతుందని కేరళ దేవాదాయశాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ తెలిపారు. నవంబర్ 16న యాత్ర ప్రారంభమవుతుందని, స్వామి దర్శనానికి వచ్చే భక్తులు తమకు కరోనా లేదని నిరూపించే కొవిడ్-19 సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా సమర్పించాల్సి వుంటుందని ఆయన సృష్టం చేశారు. ఐసీఎమ్మార్ గుర్తింపు పొందిన ల్యాబ్‌లలో మాత్రమే భక్తులు పరీక్షలు చేయించుకోవాల్సి వుంటుందని కేరళ ఆరోగ్యమంత్రి చెప్పారు. దర్శనానికి వచ్చే భక్తులందరినీ స్క్రీనింగ్ చేస్తామని, సన్నిధానం, నీలక్కల్, పంబ ప్రాంతాల్లోని హాస్పిటళ్లలో మరిన్ని సౌకర్యాలను సిద్ధం చేస్తామని తెలిపారు. పంబ, నీలక్కల్ మధ్య తిరిగే బస్సుల్లోనూ భౌతికదూరాన్ని తప్పనిసరి చేస్తామని పేర్కొన్నారు. అలాగే విపత్తు నిర్వహణల్లో భాగంగా హెలిక్యాప్టర్‌ను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.













