కేరళలో కొత్త వైరస్ కలకలం
కేరళలో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో రెండు నోరోవైరస్ కేసులను గుర్తించినట్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందది. తిరువనంతపురంలోని విజింజం ప్రాంతంలో ఇద్దరు చిన్నారులకు ఈ నోరోవైస్ సోకినట్లు పేర్కొంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఇద్దరు పిల్లల పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విజింజంలోని ఎల్ఎంఎస్ఎల్పీ స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్, డయేరియాతో విద్యార్థులు బాధపడుతున్నారని తెలియడంతో వారి నుంచి నమూనాలు సేకరించామని తెలిపారు. నమూనాలను పరీక్ష కోసం రాష్ట్ర ప్రజారోగ్య ల్యాబ్‌కు పంపిమని, అయితే సదరు పరీక్ష ఇ్దదరికి నోరో వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు వెల్లడిరచారు. దీంతో అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ పరిస్థితిని అంచనా వేసి, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిందన్నారు.













