గవర్నర్ కు ఆ అధికారం లేదు : పినరయి
విశ్వవిద్యాలయాల ఉప కులపతుల రాజీనామాలను కోరడం పట్ల కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ మండిపడ్డారు. గవర్నరకు అటువంటి అధికారాలే లేవని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఆయన ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ అనుసరిస్తోన్న విధానం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వ అధికారాలపై దురాక్రమణ ప్రయత్నమేనని దుయ్యబట్టారు. గవర్నర్‌ది అసాధారణ నిర్ణయం. రాష్ట్రంలో యూనివర్సిటీలను నాశనం చేసే ఉద్దేశంతోనే ఆయన యుద్దానికి దిగుతునున్నారు. ఆ తొమ్మిది యూనివర్సిటీల వీసీలను నియమించింది గవర్నరే. అవన్నీ అక్రమంగా జరిగాయని బావిస్తే. ఆ బాధ్యత గవర్నర్దే. చాన్సలర్‌గా ఉన్న వ్యక్తికి వీసాల రాజీనామా కోరే అధికారం లేదు అని పినరయి విజయన్ పేర్కొన్నారు..













