దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ నేత

మద్యం కుంభకోణం కేసుతో సతమతమవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి వివాదాల్లోకెక్కింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌కుమార్ తనపై దాడి చేశారని ఆప్ రాజ్యసభ ఎంపీ, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ స్వాతి మాలీవాల్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. దీనిపై తాజాగా పార్టీ సీనియర్ ఎంపీ సంజయ్‌సింగ్ స్సందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమెపై దాడి జరగడం నిజమేనన్నారు. స్వాతి చేసిన ఆరోపణలపై సంజయ్ అధికార ప్రకటన విడుదల చేశారు. కేజ్రీవాల్ నివాసం లోని డ్రాయింగ్ రూంలో స్వాతి సీఎం కోసం ఎదురుచూస్తుండగా బిభవ్ కుమార్ (పీఏ) అక్కడికి వెళ్లాడు. ఆమెతో అమర్యాదగా ప్రవర్తించాడు. దాడి చేశాడు. ఇదీ తీవ్రంగా ఖండిరచాల్సిన ఘటన. దీన్ని సీఎం తీవ్రంగా పరిగణించారు. బిభవ్‌పై కఠిన చర్యలు తీసుకుంటారు అని ఆప్ ఎంపీ అందులో పేర్కొన్నారు.