కేజ్రీవాల్‌ను 6 రోజుల ఈడీ రిమాండ్‌కు పంపిన కోర్టు!
లిక్కర్ పాలసీ స్కాంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు షాకిచ్చింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. కేజ్రీవాల్‌ను 6 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఈ నెల 28 వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉండనున్నారు. అక్కడే మద్యం కుంబకోణంతో ముడిపడిన ముడిపడిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు.
కాగా.. మద్యం స్కాం మనీ లాండరింగ్ కేసులో గురువారం సాయంత్రం కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు 2 గంటల పాటు సోదాలు జరిపారు. సీఎంపై ప్రశ్నల వర్షం కురిపించారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేస్తున్నట్లు రాత్రి 9 గంటల సమయంలో ప్రకటించి 11, 12 గంటల సమయంలో కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఈడీ కార్యాలయానికి తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు శుక్రవారం మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. లిక్కర్ మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను ప్రధాన కుట్రదారుగా పేర్కొన్న ఈడీ. 10 రోజుల పాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరింది.
అయితే కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు మాత్రం కేజ్రీవాల్‌ను ఈ కేసులో కావాలనే ఇరికిస్తున్నారని, ఇది రాజకీయ కక్షపూరిత చర్య అని, అందువల్ల ఆయనను ఈడీ కస్టడీకి అప్పగించొద్దని కోరారు. రెండున్నర గంటల పాటు వాడీవేడిగా సాగిన వాదనలు విన్న న్యాయమూర్తి చివరిగా ఈడీ వాదనలతో ఏకీభవిస్తూ కేజ్రీవాల్‌ను 6 రోజుల ఈడీ రిమాండ్‌కు పంపుతున్నట్లు తీర్పునిచ్చింది.













