ఆటోవాలా ఇంట్లో సీఎం క్రేజీవాల్ డిన్నర్
గుజరాత్ పర్యటనలో భాగంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అహ్మదాబాద్‌లో ఆటోరిక్షా డ్రైవర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇంటికి బోజనానికి రావల్సిందిగా ఆటో డ్రైవర్ ఆహ్వానించారు. మీరు మా ఇంటికి భోజనానికి రావాలని డ్రైవర్ విక్రమ్ లాల్తాని కేజ్రీవాల్‌ను కోరారు. దీనికి ఆయన స్పందిస్తూ గుజరాత్ ఆటో డ్రైవర్లు నన్ను ప్రేమిస్తున్నారు. ఈ రోజు రాత్రి డిన్నర్‌కు రమ్మంటావా. హోటల్ నుంచి నీ ఆటోలో మీ ఇంటికి తీసుకెళ్లడానికి వస్తావా అని ప్రశ్నించారు. ఇందుకు ఆటో డ్రైవర్ సరేననడంతో, మరో ఇద్దరు నేతలతో కలిసివస్తానని కేజ్రీవాల్ అతని చెప్పారు. దీంతో లాల్తానీతో పాటు అందరూ హర్షధ్వానాలు చేశారు. మాట ప్రకారం విక్రమ్ ఆటోలో రాత్రి ఎనిమిది గంటలకు హోటల్ నుంచి బయలుదేరి వారి ఇంటికి వెళ్లారు. ఆటో డ్రైవర్ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. భోజనానంతరం ఆటోడ్రైవర్ కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు తీసుకున్నారు.













