కేసీఆర్‍కు ముందే తెలుసు : ఈడీ

ఢిల్లీ మద్యం విధానం కేసులో మరిన్ని సంచలన విషయాలను ఈడీ బయటపెట్టింది. ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లపై వాదనల సందర్భంగా ఈడీ కీలక విషయాలు కోర్టు దృష్టికి తెచ్చింది. ఢిల్లీ మద్యం విధానం, రిటైల్ స్కామ్ గురించి ముందుగానే కవిత, కేసీఆర్‍కు చెప్పారని పేర్కొంది. ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలోనే తన టీమ్ సభ్యులైన బుచ్చిబాబు, అభిషేక్, అరుణ్ పిళ్లైను కవిత కేసీఆర్‍కు పరిచయం చేశారని ఈడీ తెలిపింది. ఆమె పరిచయం చేసిన వారి నుంచి కేసీఆర్ వివరాలు తెలుసుకున్నారని, కేసీఆర్‍కు సమీర్ మహేంద్రను బుచ్చిబాబు పరిచయం చేశారని వెల్లడించింది. నాలుగు ఫోన్లలో ఉన్న ఆధారాలను కవిత ధ్వంసం చేశారని కోర్టుకు తెలిపింది. కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. హైకోర్టు జడ్జి స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వు చేశారు.