కేసీఆర్కు ఆ సత్తా ఉంది : శివసేన ఎంపీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు అందరిని కలుపుకుని ముందుకు నడిపించే సామర్థ్యాలు ఉన్నాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్పై ప్రశంసల జల్లు కురిపించారు. సీఎం కేసీఆర్ ఎంతో కష్టపడి పనిచేసే రాజకీయ నేత అన్నారు. ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. అందరినీ కలుపుకునిపోయే, నాయకత్వం వహించే సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి అని అన్నారు. ఇద్దరు సీఎంలు (కేసీఆర్, ఠాక్రే) ఇతర రాజకీయ నాయకులు త్వరలోనే సమావేశమై చర్చలు నిర్వహిస్తారని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఓటమి పాలు కాబోతోందని అని అన్నారు.













