కర్ణాటక వాసులకు రాష్ట్ర ప్రభుత్వం రaలక్.. నూతన సంవత్సర వేడుకలపై
నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఉవ్విళ్లూరుతున్న కర్ణాటక వాసులకు రాష్ట్ర ప్రభుత్వం రaలక్ ఇచ్చింది. కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించింది. బహిరంగ ప్రదేశాల్లో న్యూఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోవడాన్ని నియంత్రిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. డీజేలు లేకుండా క్లబ్లు, రెస్టారెంట్లలో 50 శాతం కెపాసిటీతో మాత్రమే వేడుకలకు అనుమతిస్తామన్నారు. ఈ ఆంక్షలు డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు అమలులో ఉంటాయని తెలిపారు. కొవిడ్ 19 టీకాలు వేసుకున్న వారిని మాత్రమే వేడుకలను అనుమతిస్తామన్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.













