ఎవరి మద్దతు అవసరం లేదు.. కర్ణాటక ఫలితాలపై సిద్దరామయ్య రియాక్షన్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జోరు చూపిస్తోంది. బీజేపీకి దాదాపు రెట్టింపు స్థానాల్లో గెలిచేలా ఉంది. దీంతో ఆ పార్టీకి క్లియర్ మెజారిటీ వస్తుందని స్పష్టమైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 120 స్థానాలకు తమ పార్టీకి దక్కుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో సొంతంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, తమకు ఎవరి మద్దతూ అవసరం ఉండదని తేల్చి చెప్పారు. బీజేపీపై, ఆ పార్టీ అవినీతి పాలనపై ప్రజలు విసిగిపోయారనడానికి ఇదే నిదర్శనం అన్నారు. కర్ణాటకలో బీజేపీ మత రాజకీయాలు పనిచేయలేదని చెప్పారు.













