కర్ణాటకలో కూడా బిజెపి హవా
కర్ణాటకలోని రాజేశ్వరి నగర్, సిరా నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ తొలి నుంచి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆర్ఆర్ నగర్లో 16 మంది బరిలో ఉండగా, సిరా నియోజకవర్గంలో 15 మంది పోటీ పడ్డారు. అయితే ప్రధాన పోటీ మాత్రం బీజేపీ, కాంగ్రెస్, జేడీ-ఎస్ అభ్యర్థుల మధ్యే ఉంది. సిరా ఎమ్మెల్యే బి.సత్యనారాయణ మృతి, రాజేశ్వర్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మునిరత్నం గత ఏడాది అసెంబ్లీ సీటుకు రాజీనామా చేయడంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఆర్ఆర్ నగర్ నుంచి మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మునిరత్నంను బీజేపీ పోటీలో దింపగా, దివంగత మాజీ ఐఏఎస్ అధికారి డీకే రవి భార్య హెచ్. కుసుమకు కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చింది. జేడీఎస్ నుంచి వి.కృష్ణమూర్తి పోటీ చేశారు. సిరా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రేడియోలజిస్ట్ డాక్టర్ రాకేష్ గౌడ, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి టీబీ జయచంద్ర, జేడీఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బి.సత్యనారాయణ భార్య అమ్మాజమ్మ పోటీ చేశారు.













