కార్గిల్ వీరుడు కెప్టెన్ విక్రమ్ బత్రాకు అరుదైన గౌరవం
కార్గిల్ యుద్ధంలో అమరుడైన కెప్టెన్ విక్రమ్ బత్రాకు అరుదైన గౌరవం దక్కింది. డావిన్చీ సురేశ్ అనే కళాకారుడు ఎనిమిది గంటలు శ్రమించి టైల్స్ సహాయంతో 1,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో కెప్టెన్ బత్రా చిత్రాన్ని స్విమ్మింగ్పూల్లో రూపొందించారు. కార్గిల్ విజయ్ దివస్ను పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కళాఖండానికి నీటి అడుగున వేసిన అతిపెద్ద చిత్రంగా యూఆర్ఎఫ్ ప్రపంచ రికార్డు లభించింది. కార్యక్రమాన్ని ఆర్మీ సహకారంతో స్కూబా బాండ్ వాటర్ స్పోర్ట్స్ సంస్థ నిర్వహించింది.













