మీరు నమ్ముతారా.. ఈ కుక్క ఖరీదు రూ.20 కోట్లు
భారత్లోనే కాదు, ప్రపంచంలోనే ఖరీదైన కుక్కలు బెంగుళూరులో ఉన్నాయి. బెంగుళూర్లోని కడబామ్స్ కెన్నల్స్ ఓనర్, అసోసియేషన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ అరుదైన కుక్కలను కొనుగోలు చేస్తాడు. తాజాగా కాకాసియన్ షెపెర్డ్ చెందిన కుక్కను రూ.20 కోట్లకు కొన్నాడు. ఇలాంటి కుక్కలు ఇండియాలో అత్యంత అరుదుగా ఉన్నాయి. ఇవి టర్కీ, ఆర్కేనియా, సర్కాస్పియా, జార్జియాలో కనిపిస్తాయి. ఇవి కాపలా కుక్కలుగా పని చేస్తాయి. ఇలాంటి కుక్కలను కొనుగోలు చేసే సతీష్ కుక్కల్ని పెంచే సెలబ్రిటీగా పేరు పొందారు. అరుదైన కుక్కల్ని పెంచడం అంటే ఆయనకు ఇష్టం. అందుకే ఎంత ఖర్చుయినా కొనుగోలు చేస్తారు.
అమెరికాలో కెన్నెల్ క్లబ్ కకాసియన్ షెపెర్డ్ని శతాబ్దాలుగా ఆస్తుల రక్షణ కోసం వాడుతున్నారు. రోడ్డున పోయే ఆగంతకుల నుంచి ఇవి రక్షణ కల్పిస్తాయి. యాజమానుల పెంపుడు జంతువులను కాపాడుతున్నాయి. దొంగలతో పాటు తోడేళ్లు, కోయోట్స్ వంటి వాటి నుంచి రక్షణ కల్పిస్తున్నాయి. గతంలో సతీష్ కొరియా దోస్ మస్తిష్ను రూ.1.కోటి పెట్టి కొన్నారు. అలాగే అల్కసాన్ మలామ్యూట్ రూ.8 కోట్లు, టిబెటన్ మస్తిష్ని రూ.10 కోట్లకు కొనుగోలు చేశాడు. ప్రస్తుతం కొనుగోలు చేసిన రూ.20 కోట్ల కుక్క కడబామ్ హేడెర్ అనే పేరు పెట్టాడు. ఇది 14 నెలల వయస్సు కలిగిన ఉందని, దీనికి రోజుకు రూ.2 వేల ఖర్చు చేస్తారు. హైదరాబాద్కు చెందిన కుక్కల పెంపకం దారుల నుంచి కొనుగోలు చేసినట్లు తెలిసింది.













