కమలా హ్యారిస్ తాత గారి ఊరిలో సంబరాలు
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో మిస్టర్ జోసెఫ్ ఆర్. బిడెన్ జూనియర్ మరియు శ్రీమతి కమలా హ్యారిస్ యొక్క విజయాన్ని భారతదేశంలో ఆస్వాదించే గ్రామం శ్రీమతి కమలా హ్యారిస్ తాతగారు పుట్టిన ఊరు భారతదేశంలోని తమిళనాడులో తిరువారూర్ జిల్లాకు చెందిన గ్రామం తులసేంద్రపురం.
దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో తిరువారూర్ జిల్లాకు చెందిన కమలా హ్యారిస్ తాత గారు జన్మించిన గ్రామం అయినా తులసేంద్రపురంలో కమలా హ్యారిస్ విజయాన్ని రంగ రంగ వైభోగంగా అక్కడ ప్రజలు జరుపుకున్నారు. తులసేంద్రపురం ప్రజలు రహదారికి అడ్డంగా పటాకులు పేలుస్తూ, ఆలయంలో పూజలు నిర్వహిస్తూ, వివిధ రంగులతో వారి ఇళ్ల ముందు పెద్ద అక్షరాలతో “అభినందనలు కమలా హారిస్, మీరు మన గ్రామానికి గర్వకారణం” అని సంతోషకరమైన సందేశాలను రాసి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు.
శ్రీమతి హ్యారిస్ తానూ భారతీయ వారసత్వం కారణంగా అనుభవించిన బాధ కంటే ఒక నల్లజాతి మహిళగా అనుభవించిన బాధ చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఉపాధ్యక్ష పదవికి ఆమె ఎంచుకున్న మార్గం భారతీయురాలిగా జన్మించిన ఆమె తల్లి మరియు ఆమె విస్తృత భారతీయ కుటుంబం నేర్పిన విలువలతో ఆమె మార్గనిర్దేశం చేయబడింది అని శ్రీమతి హ్యారిస్ తెలిపారు.
“నేను 19 సంవత్సరాల వయస్సులో భారతదేశం నుండి అమెరికాకి వచ్చినప్పుడు ఈ విజయం గురించి ఊహించకపోవచ్చు కానీ నేను అమెరికాలో ఇలాంటి క్షణం ఒకటి సాధ్యం అవుతుంది అని బలంగా నమ్మాను”అని శ్రీమతి హారిస్ శనివారం తన విజయ ప్రసంగంలో తెలిపారు.













