పార్టీలో చేరాలంటే… రూ.25 వేలు చెల్లించాల్సిందే..
సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులని ఎంపిక చేసే పక్రియ మొదలు పెట్టారు. పార్టీలో చేరాలనుకునే సభ్యులు 25 వేల రూపాయలు చెల్లించి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పార్టీయేతర సభ్యులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మేలో జరగనున్న ఎలక్షన్స్ కోసం కమల్ బ్యాటరీ టార్చ్ సింబల్‌తో పోటీ చేయనున్నారు. వచ్చే నెల నుంచి పార్టీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొననున్నట్టు తెలుస్తుంది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆయన పార్టీ పోటీ చేయనుందని కమల్ గతంలోనే సృష్టం చేశారు.













