ఎన్‍హెచ్‍ఆర్‍సీ చైర్మన్ గా.. అరుణ్ మిశ్రా

జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‍హెచ్‍ఆర్‍సీ) కొత్త చైర్‍పర్సన్‍గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా బాధ్యతలు స్వీకరించారు. అయిదేళ్లపాటు లేదా 70 ఏళ్ల వయసు వచ్చేవరకు మిశ్ర ఈ పదవిలో కొనసాగుతారు. అరుణ్ మిశ్రా 2014 నుంచి 2020 సెప్టెంబర్ వరకు సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. గతేడాది డిసెంబర్‍లో జస్టిస్ హెచ్ ఎల్ దత్తు పదవీ విరమణ చేశారు. ఎన్‍హెచ్‍ఆర్‍సీ సభ్యునిగా ఉన్న జస్టిస్ ప్రపుల్ల పంత్ తాత్కాలిక చైర్మన్‍గా విధులు నిర్వహిస్తున్నారు. దాదారు ఆరు నెలల అనంతరం పూర్తిస్థాయి చైర్మన్‍ను, సభ్యులను కేంద్రం నియమించింది.