లిక్కర్ స్కామ్ నిందితులకు సీబీఐ కోర్టు షాక్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టులో జరిగిన విచారణలో నిందితులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. విచారణ అనంతరం నిందితులు విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబులకు ఈ నెల 28వ వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నిందితులైన ఈ నలుగురు ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. వీరికి కోర్టు గతంలో విధించిన రిమాండ్ శుక్రవారంతో ముగిసింది. దీంతో వారిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధర్మాసనం ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా వారి కస్టడీని పొడిగించాలని అధికారులు కోరడంతో కోర్టు వారి కస్టడీనీ పెంచింది.













