పొంగల్ వేడుకల్లో పాల్గొన్న జేపీ నడ్డా
ఇక.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పొంగల్ వేడుకల్లో పాల్గొన్నారు. అచ్చమైన తమిళ సంప్రదాయ దుస్తుల్లో వచ్చి, ఆంగ్లంలో ప్రసంగించారు. ప్రత్యేకంగా చెన్నైలో పర్యటించి ‘నమ్మఊరు’ పొంగల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం తమిళ రాజకీయ చదరంగంలో బీజేపీ ఏకాకి. అన్నాడీఎంకేతో పొత్తు ఉన్నప్పటికీ ఎన్నికల సమయానికి అది ఏమవుతుందో చెప్పలేము. దీంతో బీజేపీ పొంగల్ ద్వారా తమిళ రాజకీయానికి దగ్గర కావాలని ప్రయత్నం చేస్తోంది. ఈ సందర్భంగా అధ్యక్షుడు నడ్డా మాట్లాడుతూ….‘‘భారతీయ సంస్కృతి ఎంతో విశిష్టమైనదని, అందులో తమిళ సంస్కృతి చేరితేనే అది పరిపూర్ణమవుతుంది. తమిళ సంస్కృతి లేకుంటే అది అసంపూర్ణమన్న విషయాన్ని మనం గ్రహించాలి. తమిళ భాష చాలా పురాతనమైనది.’’ అని నడ్డా తమిళ సంస్కృతిపై ప్రశంసల వర్షం కురిపించారు.













