30 ఏళ్ల మౌనవత్రాన్ని వీడనున్న ఆమె
ఝార్ఖండ్‌లోని ధనబాద్‌కు చెందిన 85 ఏళ్ల సర్వసతి దేవికి శ్రీరాముడంటే విపరీతమైన భక్తి. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ఆమె అయోధ్య ను సందర్శించారు. అక్కడ మళ్లీ రామ మందిరాన్ని నిర్మించేంతవరకూ తాను మౌనవ్రతం చేస్తానని ప్రతినబునారు. అప్పటి నుంచి రోజులో 23 గంటలు ఎవరితో మాట్లాడకుండా నిశ్శబ్ధంగా ఉంటున్నారు. ఏదైనా కావాలంటే సైగలతో అడుగుతారు. ఒక గంట మాత్రం కుటుంబ సభ్యులతో మాట్లాడేవారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం 2020లో ప్రధాని మోదీ భూమి పూజ చేసిన తర్వాత ఆమె 24 గంటల మౌనవ్రతం పట్టినట్లు సర్వసతి దేవి కుటుంబ సభ్యులు వెల్లడిరచారు. జనవరి 22న జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి ఆమెకు ఆహ్వానం అందింది. అయోధ్యకు బయల్దేరిన దేవి ప్రాణప్రతిష్ఠ పూర్తయిన తర్వాత మౌనవ్రతాన్ని వీడనున్నట్లు అమె కుమారుడు తెలిపారు. స్థానికంగా ఆమెను మౌనీమాతగా పిలుస్తారు.













