ఆ రాష్ట్రానికి త్వరలోనే రాష్ట్ర హోదా : మోదీ
జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదంపూర్ లో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ఆ రాష్ట్రానికి త్వరలోనే రాష్ట్ర హోదా దక్కుతుందని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలు కూడా త్వరలోనే జరుగుతాయని తెలిపారు. తాను ఎప్పుడూ భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకునే ముందు చూపుతోనే ఆలోచిస్తానని స్పష్టం చేశారు. జమ్ము కశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోదా కల్పిస్తామని స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడిరచారు.













