15 నుంచి జల్లికట్టు…
తమిళుల సాంప్రదాయ క్రీడ జల్టికట్టు ఈ నెల 15 నుంచి 17 వరకు జరగనుంది. పొంగల్ (సంక్రాంతి) పండుగ సందర్భంగా కనుమ రోజు జరిగే ఈ క్రీడకు తమిళనాడు ప్రభుత్వం గత వారమే అనుమతులిచ్చింది. అయితే ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ఆటలో పాల్గొనే వారితో పాటు, వీక్షించే ప్రేక్షకుల సంఖ్యను సగానికి తగ్గించింది. మధురైలోని కొన్ని ప్రాంతాల్లో జరిగే ఈ ఆటలో పాల్గొనే ఆటగాళ్లు పదిరోజుల ముందుగానే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆటగాళ్లతో పాటు ఎద్దులకు మెడికల్ చెకప్ తప్పనిసరి. ఆటగాళ్ల సంఖ్య 150 కంటే ఎక్కువ ఉండకూడదని, వారికి కొవిడ్ 19 నెగిటివ్ సర్టిఫికెట్లు తప్పని సరి అని ప్రభుత్వం ఆదేశించింది.













