తాము అధికారంలోకి వస్తే.. కొన్ని గంటల్లోనే ఖరారు : జైరాం రమేశ్

లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థే లేరంటూ బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వారు అధికారంలోకి వస్తే ఏడాదికి ఒకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకుంటారంటూ ప్రధాని మోదీ కూడా దుయ్యబట్టారు. ఈ విమర్శలపై తాజాగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదేం అందాల పోటీ కాదంటూ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికలంటే వ్యక్తుల మధ్య జరిగే అందాల పోటీ కాదు. అందుకే నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిని ప్రకటించలేదు అని అన్నారు. అంతేగాక, తాము అధికారంలోకి వస్తే కేవలం కొన్ని గంటల్లోనే ప్రధాని పేరును ఖరారు చేస్తామని వెల్లడించారు.