బెంగళూరులో ఐటీ ఉద్యోగుల ఆందోళన
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ బెంగళూరులో ఐటీ ఉద్యోగులు, ఎన్టీఆర్ ఫోరమ్ సభ్యులు నిరసనకు దిగారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఫ్రీడమ్ పార్కులో వారంతా ఆందోళన చేపట్టారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని నినాదాలతో హోరెత్తించారు. సైకో పోవాలి.. సైకిల్ రావాలి, వియ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు. వర్షంలో తడుస్తూనే ఉద్యోగులు ఆందోళన కొనసాగించారు. చంద్రబాబుకు మద్దతుగా తెలుగు సంఘాల ఆధ్వర్యంలో బెంగళూరు జయనగర్ కాలనీలోని వినాయకుడి ఆలయంలో పూజలు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం భారీ ర్యాలీ చేపట్టారు. దీంతో ర్యాలీకి అనుమతి లేదంటూ వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.













