ఇస్రో అధిపతి సోమనాథ్ కు అరుదైన గౌరవం
చంద్రాయన్-3 మిషన్‌ను విజయవంతంగా నిర్వహించిన ఇస్రో అధిపతి శ్రీధర్ పనికర్ సోమనాథ్‌కు తెలంగాణలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. దీన్ని వర్సిటీ 12వ స్నాతకోత్సవం సందర్భంగా ప్రధానం చేయనున్నామని ఉపకులపతి ప్రొ.కట్టా నరసింహారెడ్డి తెలిపారు. ఈ నెల 5న నిర్వహించే స్నాతకోత్సవ వివరాలను ఆయన మీడియా సమావేశంలో వెల్లడిరచారు. రాష్ట్ర గవర్నర్, జేఎన్టీయూ కులపతి తమిళిసై సౌందరాజన్ అధ్యక్షత వహించనున్నారని అన్నారు. డా.సోమనాథ్ స్నాతకోపన్యాసం చేస్తారన్నారు. ఉత్తమ ప్రతిభ చాటిన 54 మంది విద్యార్థులు, పరిశోధకులకు బంగారు పతకాలు, వీరితో పాటు డిగ్రీ పూర్తి చేసుకున్న 88,226 మంది ఇంజీనీరింగ్, ఎంటెక్ విద్యార్థులకు పట్టాలు అందజేయనున్నామని తెలిపారు.













