దీనిగురించి ఎవరూ సిగ్గుపడాల్సిన పని లేదు : ఈశా అంబానీ

అపర కుబేరుడైన ముకేశ్ అంబానీ తనయగా, యువ వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఈశా అంబానీ పిరమాల్ తన వ్యక్తిగత జీవితం గురించి ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. ఐవీఎఫ్ పద్ధతిలో తాను కవలలకు జన్మనిచ్చినట్లు తెలిపారు. నేను ఐవీఎఫ్‌తో పిల్లలకు జన్మనిచ్చిన విషయాన్ని చాలా త్వరగా బయటపెడుతున్నాను. అంతా ఈ పద్ధతిని సాధారణంగా భావించాలనే ఉద్దేశంతో దీనిని వెల్లడిస్తున్నాను. దీని గురించి ఎవరూ సిగ్గుపడాల్సిన పని లేదు. అయితే ఐవీఎఫ్ చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఆ చికిత్స తీసుకుంటున్నప్పుడు శారీరకంగా చాలా అలసిపోతారు. మనకు ఆధునిక సాంకేతిక అందుబాటులో ఉన్నప్పుడు, సంతానం కోసం దానిని ఎందుకు ఉపయోగించుకోకూడదు. అది మీరు సంతోషపడాల్సిన అంశం. దాచే విషయం కాదు. దీని గురించి మీరు ఇతర మహిళలతో మాట్లాడితే ఈ ప్రక్రియ సులభంగా అనిపించొచ్చు అని ఈశా అభిప్రాయపడ్డారు. ఈశా, ఆనంద్ పిరమాల్‌కు 2018లో వివాహం జరిగింది. ఆమె 2022లో ఆద్యశక్తి, కృష్ణలకు జన్మనిచ్చారు.