క్రికెట్ అభిమానులకు శుభవార్త
క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఐపీఎల్ వేలం-2021 తేదీ ఖరారైంది. చెన్నై వేదికగా ఫిబ్రవరి 18న వేలం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. అలెర్ట్.. ఫిబ్రవరి 18న ఐపీఎల్ వేలం. వేదిక: చెన్నై అని ట్వీట్ చేసింది. కాగా, ఈ వేలంలో అత్యధిక సొమ్ముతో పంజాబ్ బరిలోకి దిగనుంది. కింగ్స్ ఎల్వెన్ పంజాబ్ వద్ద రూ.53.2 కోట్లు ఉన్నాయి. కాగా బెంగళూరు వద్ద (రూ.35.7 కోట్లు), రాజస్థాన్ (రూ.34.85 కోట్లు), చెన్నై (రూ.22.9 కోట్లు), ముంబాయి (రూ.15.35 కోట్లు), ఢిల్లీ(12.8 కోట్లు), కోల్‌కతా (రూ.10.85 కోట్లు), సన్‌రైజర్స్ (రూ.10.75 కోట్లు) ఉన్నాయి.
అయితే ఇటీవల ఫ్రాంఛైజీల వదులుకున్న ఆటగాళ్లలో ఆస్ట్రేలియా ప్లేయర్లు మాక్స్వెల్, స్టీవ్ స్మిత్‌పై అందరి చూపు నెలకొంది. ఏ ఫ్రాంఛైజీ వారిద్దరిని సొంతం చేసుకుంటుందనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. స్మిత్‌ను రాజస్థాన్, మాక్సిని పంజాబ్ వదులుకున్న సంగతి తెలిసిందే. అంతేగాక ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సత్తాచాటిన ఆటగాళ్లకు వేలంలో మంచి డిమాండ్ ఉండనుంది.













