అంతర్జాతీయ తెలుగు మహాసభలకు మిజోరం గవర్నర్ హరిబాబుకు ఆహ్వానం
వచ్చే ఏడాడి జనవరిలో జరగనున్న అంతర్జాతీయ తెలుగు మహాసభలకు మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబును నిర్వాహకులు ఆహ్వానించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ సంస్థ, చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ మహాసభలు నిర్వహించనున్నారు. ఆంధ్రమేవ జయతే అనే నినాదంతో తెలుగు భాషా వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేలా 2024 జనవరి 5, 6,7 తేదీల్లో శ్రీ రాజరాజనరేంద్రుల వారి పట్టాభిషేక మమోత్సవ సహస్రాబ్ది సందర్భంగా రాజమహేంద్రవరంలోని గైట్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలో ఈ మహాసభలు జరగనున్నాయి. ఈ సభలకు మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబును ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్, చైతన్య విద్యా సంస్థల అధినేత చైతన్యరాజు విశాఖలో ప్రత్యేకంగా కలిసి ఆహ్వనించారు. వారి ఆహ్వానం అందుకున్న ఆయన సభలకు విచ్చేసేందుకు అంగీకరించినట్లు వారు తెలిపారు.













