విమాన ప్రయాణికులకు శుభవార్త
విమాన ప్రయాణికులకు శుభవార్త. భారత్ నుంచి విదేశాలకు ప్రయాణించే ప్రయాణికులకు విమాన చార్జీలు త్వరలో 40 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ నెల 27 నుంచి అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై గత రెండేళ్లుగా ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేస్తోంది. దీంతో విదేశీ విమానయాన సంస్థలతో పాటు దేశీయ విమానయాన సంస్థలూ తమ సర్వీసులు భారీగా పెంచబోతున్నాయి. దీంతో అంతర్జాతీయ విమాన ప్రయాణ ఛార్జీలు కొవిడ్‌కు ముందున్న స్థాయికి వస్తాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే చమురు సెగతో ఆయిల్ కంపెనీలు విమాన ఇంధన చార్జీలు పెంచుతూ పోతే మాత్రం చార్జీలు పెద్దగా తగ్గకపోవచ్చని భావిస్తున్నారు.













