విదేశీ పర్యాటకులకు ఉచితంగా ఈ-వీసాలు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కరోనాతో రెండేళ్లకు పైగా దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని దేశ వ్యాప్తంగా నిలబెట్టే ప్రయత్నాలు మొదలు పెట్టామని కేంద్ర పర్యాటక, సాంస్వృతిక, శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జాతీయ సంస్కృతి, మహోత్సవం నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ -వీసా, ఫ్రీ వీసా విధానంతో 170 దేశాల విదేశీ పర్యాటకుల్ని ఆకర్షిస్తామన్నారు. ప్రోత్సాహకంగా ముందుకొచ్చిన 5 లక్షల మంది విదేశీ పర్యాటకులకు ఈ`వీసాలు ఉచితంగా ఇవ్వబోతున్నామన్నారు. అన్ని రాష్ట్రాల పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో ఏప్రిల్ 12, 13 తేదీల్లో ఢల్లీిలో సమాశేశం పెడుతునామని తెలిపారు.
రామప్ప ఆలయానికి రూ.50 కోట్లకు పైగా నిధులివ్వాలని నిర్ణయించామని తెలిపారు. పర్యాటకాన్ని పెంచేందుకు 3,600 రైలుబోగీల్ని పర్యాటకశాఖ లేదా ప్రైవేటు ఆపరేటర్లకు ఇచ్చే ఆలోచన కేంద్రం చేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ చేస్తే భద్రాచలానికి రైల్వేలైన్ వేస్తామన్నారు. రెండేళ్లకోసారి జరిగే జాతీయ సంస్కృతి మహోత్సవాన్ని ఈసారి తెలుగురాష్ట్రాల్లో నిర్వహిస్తామని చెప్పగానే ప్రధానమంత్రి పెద్దమనసుతో అంగీకరించారన్నారు.













