2024 కల్లా అమెరికాతో సమానంగా : కేంద్ర మంత్రి గడ్కరీ
దేశంశోని హైవేలు 2024 కల్లా అమెరికాతో సమానంగా ఉంటాయని, గ్రీన్ ఎక్స్ప్రెస్ వేలు, రైలు వంతెనలను శరవేగంగా పూర్తి చేస్తున్నామని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. భారత్మాల-2కు త్వరలో కేంద్ర కేబినెట్ ఆమోదం లభించనుందని తెలిపారు. ఈ ఏడాది రూ.16,000 కోట్లతో రైలు వంతెలను నిర్మించనున్నాం. ఐదేళ్లలో ఆ బడ్జెట్ను రూ.50,000 కోట్లకు పెంచుతాం. పితోర్గఢ్ మీదుగా కైలాశ్ మానస సరోవర్కు చేపట్టిన హైవే నిర్మాణం 93 శాతం పూర్తయింది. భారత్మాల`2 కింద 5,000 కిలో మీటర్ల హైవేలను తొలుత నిర్మిస్తాం. మొత్తం ఈ ప్రాజెక్టు కింద 35,000 కిలోమీటర్లను నిర్మించాలనేది లక్ష్యం. దీని ద్వారా 580 జిల్లాలను అనుసంధానం చేయనున్నాం. 600 జిల్లాల మధ్య రాకపోకలపై సాంకేతికంగా అధ్యయనం చేసి కారిడార్లను చేపడుతున్నాం. రaార్ఖండ్లో రూ. 70,000 కోట్లతో 7 గ్రీన్ఫీల్డ్ హైవేలను నిర్మిస్తున్నాం అని వెల్లడిరచారు.













