రికార్డు సృష్టించిన భారత్..
ఎగుమతుల్లో భారత్ దూసుకుపోతున్నదని, ఆత్మనిర్బర్ భారత్ విజయపథంలో ముందుకు సాగుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా 9 రోజుల ముందే 400 బిలియన్ డాలర్ల ఎగుమతులతో రికార్డు సృష్టించామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అత్యధిక ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశిత గడువుకన్నా ముందే సాధించిందని తెలిపారు. ఈ విజయం వెనుక రైతులు, చేనేత కార్మికులతో పాటు తయారీదారుల పాత్ర కీలకం అన్నారు. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించుకుమన్నామని గుర్తు చేశశారు. ఇప్పటి వరకు ఈ స్థాయి ఎగుమతులు జరగలేవన్నారు. ఇంతటి భారీ లక్ష్యాన్ని కూడా ఎప్పుడూ నిర్దేశించుకోలేదని తెలిపారు. 9 రోజుల ముందే లక్ష్యాన్ని సాధించిందని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.













