త్వరలోనే ఈ-పాస్ పోర్ట్ లు
పాస్‌పోర్ట్ కొత్త రూపం సంతరించుకోనుంది. మరింత రక్షణతో ఇది అందుబాటులోకి వస్తోంది. అతి త్వరలోనే పౌరులకు ఈ-పాస్ పోర్ట్‌ల జారీని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. తదుపరి తరం ఈ -పాస్ పోర్ట్‌లను ప్రవేశపెట్టనున్నట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి సంజయ్ భట్టాచార్య వెల్లడించారు. ఈ పాస్ పోర్ట్ బయోమెట్రిక్ డేటాతో సురక్షితంగా ఉంటుందన్నారు. అంతర్జాతీయంగా ఇమిగ్రేషన్ చెక్ పోస్ట్‌ల వద్ద ప్రక్రియను వేగంగా పూర్తి చేసుకుని వెళ్లిపోయేందుకు వీలవుతుందని చెప్పారు. నాసిక్‌లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్ తయారు చేసినుట్టు తెలిపారు. మైక్రో చిప్‌ను అమర్చిన పాస్ పోర్ట్ కార్డును కేంద్రం జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. చిప్ లో కీలక సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సాయంతో ఇందులోని డేటాను బదిలీ చేసుకోవడానికి వీల్లేకుండా ఉంటుంది.













