హెచ్-1బీ వీసాల్లో 75శాతం భారతీయులకే : కేంద్రం
అమెరికా 2020లో జారీచేసిన హెచ్-1బీ వీసాల్లో 75 శాతం భారతీయులకే లభించినట్లు కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ తెలిపారు. 2018లో 69 శాతం వీసాలు దక్కగా, తాజాగా అవి 75 శాతంకి చేరాయని వెల్లడించారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ భారతీయుల మెజరిటీ హెచ్-1బీ వీసాలను అమెరికా కంపెనీలే స్పాన్సర్ చేసినట్లు తెలిపారు. విదేశాల్లో విద్యాభాస్యానికి ఈ ఏడాది మార్చి 20 నాటికి 1,33,135 మంది విద్యార్థులు మన దేశం నుంచి వెళ్లినట్లు వెల్లడిరచారు. 2021లో ఈ సంఖ్య 4,44,554 మేర ఉందన్నారు. 2020లో మాత్రం ఇది 2,59,655కే పరిమితమైనట్లు తెలిపారు. అత్యధికులు అమెరికా, కెనడా, యూకేలకు వెళ్తున్నట్లు తెలిపారు.













