ఉత్తరప్రదేశ్ మహిళ అరుదైన రికార్డు!
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ అత్యంత పొడవైన కురులతో గిన్నిస్ రికార్డు కొట్టింది. 46 ఏండ్ల స్మితా శ్రీవాస్తవ 236.11 సెం.మీ (7 అడుగుల 9 అంగుళాలు) పొడవైన జుట్టుతో ఈ అరుదైన రికార్డును సాధించింది. తన తల్లి స్ఫూర్తితో 14 ఏండ్ల నుంచి పొడవైన జుట్టును పెంచడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్టు ఆమె తెలిపారు. చిన్నప్పటి నుంచి పొడవైన, అందమైన కురులున్న బాలీవుడ్ హీరోయిన్లను అనుకరించే దానినని, సాధారణంగా వారానికి రెండు సార్లు తలస్నానం చేస్తానని, తలస్నానం కురులు ఆరబెట్టడం, స్టైలింగ్ తదితర ప్రక్రియలకు సుమారు మూడు గంటల సమయం పడుతుందని తెలిపింది.













