భారతీయ విద్యార్థినికి… యూఏఈ గోల్డెన్ వీసా

ప్రముఖులకు మాత్రమే లభించే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గోల్డెన్ వీసాకు ఓ భారతీయ విద్యార్థిని ఎంపికయ్యారు. కేరళకు చెందిన తన్‍సీమ్ అస్లాంకు ఆ గౌరవం దక్కింది. ఉన్నత విద్యలో ఆమె కనబరిచిన ప్రతిభ ఆధారంగా గోల్డెన్ వీసాకు ఆమె ఎంపికయ్యారు. దాంతో, పదేళ్లపాటు అంటే 2031 వరకు యూఏఈ లో ఆమె ఎలాంటి ఇతర అనుమతులు లేకుండా, విద్య, ఉగ్యోగాలను కొనసాగించే వీలు కలుగుతుంది. నా జీవితంలో ఎంతో ఆనందం కలిగించిన క్షణాలంటూ తన్‍సీమ్ అస్లాం ఈ సందర్భంగా ఉద్యోగానికి లోనయ్యారు. అల్లాకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు.
తన తల్లిదండ్రుల సహకారం వల్లే ఇది సాధ్యమైందన్నారు. షార్జాలోని అల్ ఖసీమా యూనివర్సిటీలో ఇస్లామిక్ షరియాను ఆమె పూర్తి చేశారు. మొత్తం 4 జిపిఎకు 3.94 పాయింట్లు ఆమె సాధించారు. సంపన్నులు, పరిశోధకులు, సెలెబ్రిటీలకు మాత్రమే ఇచ్చే గోల్డెన్ వీసాను ఓ విద్యార్థి పొందడం అరుదైన విషయమన్నది గమనార్హం.