కోవిడ్ కారణంగా నిరాడంబరంగా నేవీ డే వేడుకలు
భారత్ పాకిస్తాన్‌పై సాధించిన విజయానికి సూచికగా ఏటా నిర్వహించే నేవీ డే విన్యాసాలు ఈ ఏడాది నిరాడంబరంగా జరుపుతున్నారు. తూర్పు తీరం నుంచి బయలుదేరిన యుద్ధనౌకలు కరాచీ పోర్టును స్వాధీనం చేసుకోవడం ద్వారా డిసెంబర్ 4వ తేదీన భారత్ విజయం సాధించింది. దీనికి గుర్తుగా ఏటా విశాఖ తూర్పు నౌకాదళం ఇండియన్ నేవీ డే విన్యాసాలు భారీ ఎత్తున జరుగుతుంటాయి. కానీ ఈ ఏడాది కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఎలాంటి విన్యాసాలు నిర్వహించలేదు. కేవలం డిసెంబర్ 4న సాయంత్రం విశాఖ తీరంలో యుద్ధ నౌకలపై విద్యుద్దీపాలు అలంకరించి నేవీ డే కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ దశలో విశాఖ బీచ్‌లో ఉండే విక్టరీ ఎట్ సీ స్తూపం వద్ద తూర్పు నౌకా దళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ జైన్ పూలమాలవేసి అమరవీరులకు నివాళులు అర్పించారు. శత్రుదేశాలతో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు నేవీ ఎప్పుడు సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.













